calender_icon.png 6 February, 2026 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలి

06-02-2026 01:33:58 AM

హనుమకొండ,ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి):తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకి సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె. మురళీ మనోహర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరుణహరి శేషు అధ్యక్షతన నక్కలగుట్ట లో జరిగిన స మావేశంలో ప్రొఫెసర్ కె. మురళీ మనోహర్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు బీసీలకి సబ్ ప్లాన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

2011 నుండి బీసీలకి సబ్ ప్లాన్ ప్రకటించాలని చేసిన ఉద్యమ ఫలితంగా 2013లో నా టి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో బీసీలకి సబ్ ప్లాన్ ప్రకటించింది కానీ రాష్ట్ర విభజన వలన ఆ హామీ కార్యరూపం దాల్చ లేదని వాపోయారు.2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు బీసీలకి సబ్ ప్లాన్ ప్రకటించడం తో పాటు బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి 20వే ల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రొఫెసర్ ఎం. సా రంగపాణి, ప్రొఫెసర్ గోపు సుధాకర్ మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ప్రవేశపెట్టిన 12 బడ్జెట్ లలో బీసీల సంక్షేమానికి మూడు శాతం కంటే తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా, కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ల కి కు ల ఫెడరేషన్లకి బడ్జెట్ లో తక్కువ నిధులను కేటాయిస్తూ ఆ కేటాయించిన నిధులను కూ డా ఖర్చు చేయకపోవడం వలన బీసీలకి, కులవృత్తిదారులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గడ్డం.

కృష్ణ య్య మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించ కుండానే ప్రభుత్వం గ్రా మపంచాయతీ ఎన్నికలను నిర్వహించింది ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలను కూడా నిర్వహిస్తుందన్నారు. 

ఎంబీసీ నాయకులు డాక్టర్ పాలడుగుల సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగ ణన రిపోర్టుని ఆయా కులాల వెనుకబాటు తనానికి సంబంధించిన పూర్తి నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కె. మురళీ మనోహర్ రూపొందించిన బీసీ సబ్ ప్లాన్ డ్రాఫ్ట్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎదునూరి రాజమౌళి, ధారబోయిన సతీష్, డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్, డాక్టర్ కత్తెరపల్లి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.