calender_icon.png 6 February, 2026 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్డపోతరం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

06-02-2026 01:34:05 AM

పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ 

జిన్నారం/ అమీన్ పూర్ ఫిబ్రవరి 5(విజయక్రాంతి) : గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం పరిధిలో 10,11,12,13 వార్డుల్లో జిన్నారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజు గౌడ్, మాధరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన రోడ్ షో, కార్నర్ మీటింగ్ అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. 11న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే 18 వా ర్డుల అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాదారం, మంత్రి కుంట దుబ్బకుంట సమగ్ర అభివృద్ధికి మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు.

కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మంత్రంతోనే ప్రజల ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్  ప్రభు త్వం హయాంలో మాదారం ఎదుర్కొన్న నిర్లక్ష్యానికి స్వస్తి పలికి, రాబోయే కాలంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలతో గ్రా మ రూపురేఖలు మారుస్తామని హామీ ఇస్తున్నన్నారు. క్రమశిక్షణతో, కలిసికట్టుగా పని చేసి 4 వార్డుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మాదారం అభివృద్ధికి సంబంధించి బ్లూ ప్రింట్ రూపంలో మేనిఫెస్టోలో విడుదల చేస్తున్నామన్నారు. అంతర్గత రహదారుల విస్తరణ, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, అందించడం లక్ష్యమన్నారు.

గత పదేళ్లలో గ్రామాన్ని పట్టించుకోని వారు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. రాజు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాగా 10వ వార్డు వెంకటేష్ గౌడ్, 11వ వార్డు రాజు గౌడ్, 12వ వార్డు ఠాకూర్ శివాని లక్ష్మణ్ సింగ్, 13వ వార్డు ఎరుకలి రవిలను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, చంద్రారెడ్డి, సీతారం సింగ్, సీతారాం యాదవ్, మంత్రి అశోక్, నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.