13 April, 2026 | 4:06 PM

Breaking News

కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •   ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కు కళాశాలలో ఘనంగా నివాళులు   •  

ఎక్స్‌అఫిషియో ఓట్లకు నయా రూల్!

06-02-2026 01:33 AM

నియోజకవర్గం పరిధిలోనే ఓటు వేసేలా.. రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు ఒక ఎత్తు అయితే.. మేయర్, చైర్మన్ ఎన్నికలు మరో ఎత్తు. ఎన్నికల ఫలితాల తర్వాత మెజార్టీ వార్డులను దక్కించుకున్న పార్టీనే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌లను కూడా దక్కించుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. కానీ ఈ సభ్యుల ఓటు వినియోగంపై ఎన్నికల సంఘం కొత్త రూల్ తీసుకురావాలని నిర్ణయించింది.

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే లా చర్యలు తీసుకోనుంది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్ సభ్యులు, రాజ్యసభ సభ్యుల (ఎక్స్ అఫిషియో సభ్యులు) ఓటు హక్కు వినియో గం కీలకంగా మారనుంది.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ ఓటు మున్సిపాలిటీలో ఉంటే అక్కడే, లేదా గ్రామంలో ఉంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎక్స్ అఫిసియో సభ్యుడిగా ఓటు వేయొచ్చు. లోక్‌సభ సభ్యులకు సైతం నియోజకవర్గం పరిధిలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలోనైనా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులకు అయితే రాష్ర్టంలో ఎక్కడైనా ఓటెయ్యడానికి అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు.

కొత్త మార్గదర్శకాలు..

మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు) ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం కొత్త మా ర్గదర్శకాలు రెడీ చేస్తోంది. ఎవరు ఎక్కడ..? ఎలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలో స్పష్టంగా తెలియజేయనుంది. గతంలో జరిగిన తప్పులు ఈసారి పునరావతం కాకుండా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

రెండు, మూడు రోజుల్లో కొత్త మార్గదర్శకాలను వెల్లడించనున్నారు. అందులో భాగంగానే ఎక్స్ అఫిషియో సభ్యుల వివరాలి వ్వాలని జిల్లా కలెక్టర్లను కోరిన విషయం తెలిసిందే. వివరాలతోపాటు సదరు ఎక్స్ అపిషియో సభ్యుని ఓటు ఎక్కడ వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం మార్గదర్శకాల జారీ తర్వాత స్పష్టత రానుంది.

గత మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం

గత మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు లేకపోయినా ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను ఆయుధంగా చేసుకుని పాలకవర్గాలను కైవసం చేసుకున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని నిర్ణయించారు.

ముఖ్యంగా నగర శివారుప్రాంతాల్లోని తుక్కుగూడలో బీఆర్‌ఎస్‌కు ఒక్కరే వార్డు సభ్యుడు గెలిచారు. కానీ నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను ఉపయోగించుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. ఆదిభట్లలోనూ ఇదే పరిస్థితి. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.