21-12-2025 12:00:00 AM
తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం
దాసు సురేశ్, వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రాజ్యాధికార సమితి
హైదరాబాద్, సిటీబ్యూరో డిసెంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 50 శాతం పైచిలుకు విజయాన్ని నమోదు చేయడం బీసీల పెరుగు తున్న రాజకీయ చైతన్యానికి నిదర్శనమని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. పార్టీ అనుబం ధం లేకుండా సైతం సుమారు 11 శాతం బీసీలు విజయం సాధించడం గమనార్హమన్నారు.
గెలుపొందిన బీసీ సర్పంచ్లకు అభి నందనలు తెలుపుతూ, రాష్ట్రవ్యాప్తంగా బీసీ నాయకులను హైదరాబాద్లో ఘనంగా సన్మానించి, బీసీల్లో రాజ్యాధికార ఆకాంక్షను మరింత బలపరుస్తామని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.9పై హైకోర్టు స్టే బీసీలలో తీవ్ర ఆవేదనను, రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించిందన్నారు. అలాగే, ఇటీవల ముగిసిన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావన గానీ, ప్రైవేట్ బిల్లు గానీ ఏ పార్టీ ప్రవేశపెట్టకపోవడం రాజకీయ పార్టీల బీసీల పట్ల వైఖరిని స్పష్టంగా చూపుతోందని వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముం దుకు తీసుకువచ్చేందుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టి త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. బీసీల హామీలను విస్మరించే ఏ పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.