21-12-2025 12:00:00 AM
లేనిపక్షంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీసీలు తగిన బుద్ధి చెప్తారు
బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విషారదన్ మహరాజ్
ముషీరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ బీసీలను నమ్మించి మోసం చేసిందని బీసీ మేధావుల పురం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టీ. చిరంజీవులు, అఖిలభారత వెనుకబడిన తరగతుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్‌లు అన్నారు. రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని వారు డి మాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిం చి మోసం చేసిందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి 17 శాతం రిజర్వేషన్లతో సర్పం చ్ ఎన్నికలకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. బీసీల వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలకు సర్పం చ్ ఎన్నికల్లో బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి తగిన బుద్ధి చెప్పారన్నారు.
బీసీల రిజర్వేషన్ల అమలు విషయం లో కాంగ్రెస్, బిజెపిలు డ్రామాలాడుతున్నాయని వారు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మెస్సితో ఫుట్బాల్ ఆడారని, బీసీలు రేవంత్ రేవంత్ తో సర్పంచ్ ఎన్నికల్లో ఫుట్ బాల్ ఆడారన్నారు. అగ్రవర్ణా లు డబ్బులు పంచి గెలిస్తే, బీసీలు మనసును గెలిచి 50% సర్పంచ్ ఎన్నికల్లో గెలిచారని అన్నారు. రాష్ట్రంలో బీసీ విప్లవం వచ్చి కాంగ్రెస్ కు గోరి కట్టిందన్నారు.
రాబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలు తెలంగాణ గడ్డపై జెండా ఎగరేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీసీలకు వారు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరే షన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్, గంగాధర్, వేణు, శ్రీకాంత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.