calender_icon.png 11 November, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

11-11-2025 06:31:57 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జాతీయ విద్యా దినోత్సవం, స్వాతంత్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజైన నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె.ఏ. గౌస్ హైదర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.                         

హన్మకొండ గ్రంథాలయంలో...

భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రివర్యులు మౌలానా అబుల్ కాలమ్ ఆజాద్ 137వ జయంతి, జాతీయ విద్య దినోత్సవంను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ హన్మకొండ గ్రంథాలయంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే. శశిజాదేవి, గ్రంథాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, లైబ్రేరియన్ పురుషోత్తం రాజు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకులు రాజేష్, గ్రంధాలయం పాఠకులు తదితరులు పాల్గొన్నారు.