19-05-2025 12:09:46 AM
కొల్లాపూర్ మే 18: 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీసీలంతా కదం తొక్కారు. నియోజక వ ర్గం కేంద్రానికి నలుమూలల నుంచి డిళ్లెం బల్లెం డప్పులతో తరలి వచ్చి పట్టణంలోని మాధవ స్వామి దేవాలయం నుంచి భారీగా ర్యాలీ చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి బీసీ ఉద్యమం ప్రారంభమైందన్నారు.42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని తమ న్యా యమైన బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపడుతున్నట్లు రాష్ట్ర జేఏసీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలన్నీ బిసిలకు ఓట్లు వేయించుకుని మోసం చేశాయని మండి పడ్డారు.
ఏడున్నర దశాబ్దాల నుంచి బీసీలను అన్ని రంగాలల్లో చిన్నచూపు చూస్తూ మోసం చేశాయని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలో రిటైర్డ్ డీఈవో,ప్రొఫెసర్ శివార్చక వి జయ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పెబ్బేటి మల్లిఖార్జున్, పచ్చిపాల సుబ్బయ్య, పగిడాల శ్రీనివాసులు, బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి రిలే నిరహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలుపరిచే వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం కేంద్రంలో రిలే నిరహార దీక్షలు చేపడతామని స్పష్టం చేశా రు. గ్రామ గ్రామాన బీసీ కులాలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల్ ఆర్మీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ యాదవ్, సదానంద్ గౌడ్, బీసీ జన చైతన్య వేదిక రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బోయిని మహేష్ యాదవ్, బీసీ జ న చైతన్య వేదిక నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, రాజేందర్, మేకల సా యిలు, ఆంజనేయులు, గాలి యాదవ్, పెబ్బేటి కృష్ణయ్య, బరిగేల సాయిలు యాదవ్, 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి జేఏసీ నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు కట్టా శ్రీనివాస్, గడ్డం శేఖర్ యాదవ్, రామస్వామి యాదవ్, బీసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.