19-05-2025 12:07:53 AM
కృష్ణ, మే 17. రైతు పై మొసలి దాడి చేసి నదిలోకి లాక్కెళ్లిన ఘటన నాంపేట జిల్లా కృష్ణ మండలంలోని కురుమూర్తి గ్రామ శివారులోని భీమా నదిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తిప్పణ్ణ 50 సం. శివప్పతో కలిసి శనివారం తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయగా బోరులో నీరు రాలేదు దీంతో తిమ్మప్ప నదిలో దిగి ఫుట్ బాల్ వద్ద చెత్త తీస్తుండగా మొసలి అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కిలినట్లు శివప్ప తెలిపారు.
గ్రామస్తులు కు టుంబ సభ్యులు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్న క్రమంలో గ్రామస్తులు ఒడ్డున చూస్తుండగానే మొసలి తిప్పనను నీటిలోకి లాక్కిలినట్లు వారు తెలిపారు ఏడుగురు జాలర్లు నీటిలో గాలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు