12-09-2025 12:00:00 AM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేష్ కాశిపాక పిలుపు
కరీంనగర్, సెప్టెంబరు 11 (విజయ క్రాంతి): ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే ’బీసీ డిక్లరేషన్’ సభను రాజకీయ పార్టీలకతీతంగా బీసీలందరూ కలిసి కట్టుగా విజయవం చేయాలని తె లంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశిపాక రాజేష్ కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి గడ్డ మీద బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వాటాను నేడు తేల్చి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్నదని పేర్కొన్నారు.
కామారెడ్డి గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఈ వేదిక నుండే విజయోత్సవ సంబరాలతో ఈ సభ జరపడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 15న జరిగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు, వివిధ రాజకీయ పార్టీలలోని బీసీ నేతలు జెండా, ఎజెండాలను పక్కనపెట్టి బీసీల ఐక్యతను చాటి సభను విజయవంతం చేయాలని రాజేష్‌పిలుపునిచ్చారు.