కుమ్మెర గట్టుపై రెడ్ల పెత్తనం!
దైవదర్శనం పేరిట కాసుల దందా
- భక్తుల వద్ద వంద.. వ్యాపారుల వద్ద 10వేలు ముక్కు పిండి వసూలు
- కోట్ల రూపాయలు దండుకుంటున్నా పట్టించుకోని అధికారులు
- అక్రమ వసూళ్లపై ప్రశ్నించిన పాపానికి బలైన బీసీ బిడ్డ
- లక్ష మందికి పైగా జాతరకు..
- పదివేల మందికి ఒక్కరే పోలీసు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కుమ్మెర గట్టు జాతరలో అక్కడి రెడ్లు రాజ్యమేలుతున్నా రు. ఎత్తున గుట్టపై వెలసిన మల్లన్న స్వామి కాకతీయుల కాలం నుంచి పూజలందుకుంటున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, తాము సుఖశాంతులతో ఉండాలని సమీ ప గ్రామాల రైతులు మల్లన్నను వరా లు కోరుతుంటారు. జాతరకు అనేక ఏళ్లుగా భక్తుల తాకిడి భారీగా పెరిగింది. శ్రామిక కులాలు ఆరాధించే కుమ్మెర గుట్టపై క్రమక్రమంగా రెడ్డి సామాజికవర్గం వారే పెత్త నం చలాయించడం మొదలైంది.
మల్లన్న గుడి అభివృద్ధి పేరిట భక్తుల నుంచి కానుకల రూపంలో డబ్బు పోగుచేసుకొని, పనిచేసిన వారికి డబ్బులు ఇస్తూ క్రమంగా ఆ గుట్టపై పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. కొలిచి మొక్కే మల్లన్న కోసం భక్తులు వస్తే, రెడ్లు ఆ భక్తుల నమ్మకాన్ని క్రమంగా సొమ్ము చేసుకుంటూ వస్తున్నా రు. టెంకాయ, చిరు వ్యాపారులకు షెల్ట ర్లు, తైబజార్ టెండర్లు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల ఏర్పాటు పేరిట.. డబ్బుల వసూళ్లకు వారు క్రమం గా అలవాటు పడ్డారు.
నాగర్‌కర్నూల్ కుమ్మెరి గట్టు వ్యవహారంలో అధిక శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం వారే శ్రామిక కులాల చేత పనులు చేయించి ఆలయంపై పెత్తనం చెలాయి స్తూ వస్తున్నారని పూర్వీకులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై ఎవరు ప్రశ్నించినా.. అదే గ్రామానికి చెందిన ఇతర కులస్తుల చేత దాడులకు తెగబడుతూ అణిచివేతకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సుమారు పది రోజులపాటు జరిగే ఈ జాతరలో లక్ష మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. టెండర్ పేరు చెప్పి గ్రామ పంచాయతీ నిధి కింద కొంత జమచేస్తూ భక్తుల, చిరు వ్యాపారుల వద్ద ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని ప్రశ్నించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాగోతాన్ని పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో ఇతర అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం.
నామమాత్ర భద్రత..
కుమ్మెర గట్టు మల్లన్న స్వామి దర్శనం కోసం జిల్లా నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు సుమారు పదివేల మందికి పైగా హాజరవుతారని అంచనా. ఈ లెక్క మరో రెం డు రెట్లు అధికంగానే ఉంటుందని, అయినప్పటికీ ప్రతిరోజు కేవలం ఒక కానిస్టేబుల్, ఇద్దరు హోమ్‌గార్డులను మాత్రమే విధుల్లో ఉంచడం వెనుక ఆంతర్యమేంటని సర్వత్రా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కేవలం జాతర రోజు మాత్రమే ఎస్‌ఐ స్థాయి అధికారులు నియమించినట్లు అధికారులు చెప్తున్నారు. ఇటీవల రాజక కుటుంబంపై దాడి జరిగిన సమయంలో కనీ సం ఒక్క పోలీసు కూడా లేకపోవడం.. పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. దాడి ఘటన ఈనెల 18న చోటు చేసుకోగా 19న దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈనెల 20న ‘విజ యక్రాంతి’ దినపత్రికలో 'కుమ్మెర గట్టుపై టెంయల పంచాయతీ' అనే కథనం ప్రచురితమైం ది.
దాడి నేపథ్యంలో అస్వస్థతకు గురైన శిశువు ఈనెల 21న మృతిచెందింది. అయినప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై సీరియస్‌గా దృష్టి పెట్టకపోవడం వారి నిర్లక్ష్యాన్ని బట్టబయలుచేసింది. దాడికి పాల్పడిన రెడ్డి వర్గానికి పూర్తిగా వత్తాసు పలికే విధంగానే పోలీసుల వ్యవహార శైలి ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఈనెల 21న బాధితుల పక్షాన ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) వ్యవస్థాపకులు విశారదన్ మహరాజ్ ధర్నా చేశారు.
అప్పటికి దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేయకపోగా.. దాడిచేసిన వారు నుంచి ఫిర్యాదును స్వీకరించి బాధితులపైనే కేసులు నమోదుచేయడం పట్ల ఆగ్రహ జ్వాల పెల్లుబిక్కింది. మృత శిశువును ఖననం చేసుకునేందుకు ఆ ఒక్కరోజు రాత్రి కూడా బాధి తులు దీనస్థితిలో గడిపారని, అధికార యం త్రాంగం ఎవరు బాధితుల పక్షాన ముందుకు రాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్ర హం పెరిగింది.
ఆ మరునాడు ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇతర ప్రజా సంఘాలన్నీ ఏకమై బాధితుల పక్షాన నిలబడి పోరాటంలో పాల్గొన్నారు. బాధితులు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారన్న ఉద్దేశంతోనే రెడ్డి సామాజికవర్గం నేతలు కులం పేరుతో దూషణకు దిగినట్లు బాధితులు ఆరోపించారు. కులం పేరుతో దూషించిన విషయాన్ని కూడా పోలీసు యం త్రాంగం పట్టించుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చెప్తున్నప్పటికీ, కుల ధ్రువపత్రం మంజూరి కోసం తహసీల్దార్‌కు అర్జీ పెట్టుకున్నా అది ఇంకా రాకపోవడంతో కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని సాకు చూపించడం దారుణమని బాధితులు ఆరోపిస్తున్నా రు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ తుకారాం రెడ్డి ఆలయ నిర్వహణ బాధ్యతలను చేపట్టి పెత్తనం చెలయించాడు.
అధికారం దుర్వినియోగం చేస్తూ దైవదర్శనం పేరిట కోట్ల రూపాయలు దండుకుంటున్నప్పటికీ ఎంపీడీఓ, డీపీఓ జిల్లా ఉన్నతాధికారుల సైతం ఈ వ్యవహారం పట్ల మౌనం దాల్చడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నా యి. గతేడాది ఊరుకొండపేట ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు ల వైఫల్యమే బయటపడింది. అయినా గుణపాఠం నేర్వని పోలీస్ యంత్రాంగం కుమ్మెర గట్టు ఘటన వ్యవహారంలోనూ అడుగడుగు నా నిర్లక్ష్యమే కనబర్చింది. ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా, రెడ్డి కులస్తులను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
భద్రతా లోపం లేదు
ఏడాదిలో ఐదు రోజులపాటు జరిగే కుమ్మెర గట్టు జాతరలో ప్రధాన ఘట్టం బండ్ల ఊరేగింపు, మల్లికార్జున స్వామి కళ్యాణం జరిగే రెండు రోజుల్లో భద్రత ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటు లేదు. భక్తుల భద్రత కోసం నాగర్‌కర్నూల్ పీఎస్ నుంచి ముగ్గురు, బిజినపల్లి పీఎస్ నుంచి ముగ్గురు చొప్పు న పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశాం.
బుర్రి శ్రీనివాసులు,
డీఎస్పీ, నాగర్‌కర్నూల్
పంచాయతీకి అందడం లేదు
కుమ్మెర గట్టు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు ఇచ్చే కానుకలు, టెంకాయ టెండర్ డబ్బులు, బోనం టోకెన్ డబ్బు లు కుమ్మెర గ్రామపంచాయతీ ఖాతాలో జమ కావడం లేదు. నేను కొన్ని రోజుల క్రితమే ఇక్కడ విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
చిన్నమ్మ, ఎంపీడీవో, నాగర్‌కర్నూల్




