calender_icon.png 20 August, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండండి

20-08-2025 12:00:00 AM

  1. వరద ఉధృతిని పర్యవేక్షించాలి

నీటిపారుదల అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

నేడు ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టుల సందర్శన

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): భారీ వర్షాలు కురవడంతో పాటు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న వేళ నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. వరదల ఉధృతికి ఎక్కడైనా గండ్లు పడితే సత్వరం పూడ్చివేత చర్యలు చేపట్టాలన్నారు. తాజాగా వస్తున్న నీటి ప్రవా హాలతో రాష్ర్టంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, సహా అన్ని నీటి వనరులను పూర్తిగా నింపాలన్నారు.

రాష్ర్టంలో భారీ వర్షాలపై మంగళవారం నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ విభా గం అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు, నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులను సందర్శించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోగా..

రాష్ర్టంలో మొత్తం 34,740 చెరువులకు గాను 12,023 చెరువులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండగా... 9,100 చెరువులలో 75 నుండి 100 శాతానికి నీరు చేరుకుందన్నారు. తాజా వర్షాల ఉధృతికి దెబ్బ తిన్న 177 చెరువులు, కాలువలు, లిఫ్టుల పునరుద్ధరణకు రూ.335 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 3,500 చోట్ల తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.