20-08-2025 12:03:15 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, ఆగస్టు 19 :జీవితంలో మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. కలెక్టర్ మాట్లాడుతూ గతంతో పోల్చితే ఫోటోగ్రఫీలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఫోటోగ్రఫీ కొత్త టెక్నాలజీ, ఫ్యాషన్ ప్రతిబింబం, జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ అన్నారు.
టీజీఐఐసీ చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ జర్నలిజం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని, ఒక ఫోటో మనసులను కదిలించే శక్తిని కలిగి ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఒక విలువైన సామాజిక సాధనమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, టిజిఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్, టియుడబ్లుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్, జిల్లా అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు ఆరీఫ్, జనరల్ సెక్రిటర్ సత్యం, వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.