20-08-2025 12:01:19 AM
పటాన్ చెరు, ఆగస్టు 19 : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న యాదవ సంఘం కళ్యాణ మండపం పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొని వస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
మంగళవారం సాయంత్రం ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ఫాల్ సీలింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని తెలిపారు. పనులు త్వరితగదన పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి ఏఈ శివకుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, మేకల వెంకటేష్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, ప్రతినిధులు పాల్గొన్నారు.