calender_icon.png 18 August, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

18-08-2025 02:19:13 AM

రాజాపూర్ ఆగస్టు17:భారీ వర్షాలు కురుస్తున్న నేపత్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా ఆదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.భారీ వర్షాల కారణంగా ఆదివారం జాయింట్ కలెక్టర్ ఏ నుగు నరసింహారెడ్డి రాజాపూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.ప్రజలు వ ర్షాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశా రు.

మండలంలో కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజలకు సమస్యలు ఎదురైతే త్వరితగతిన స్పందించాలని ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఆర్‌ఐ యాదయ్యకు జాయింట్ కలెక్టర్‌సూచించారు.