29-07-2025 02:27:01 AM
కేసును సుమోటోగా విచారణకు ఆదేశం
సీఎస్, వైద్య ఆరోగ్యశాఖను నివేదిక కోరిన కమిషన్
హైదరాబాద్ సిటీబ్యూరో జులై 28 (విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అక్రమ సరోగసి, శిశువుల విక్రయాల రాకెట్‌పై రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్, దాని అనుబంధ క్లినిక్‌లలో జరిగిన చట్టవిరుద్ధమైన, అనైతిక పద్ధతులపై వార్తాపత్రికల్లో ప్రచురితమైన నివేదికలను సుమో టోగా స్వీకరించింది.
ఆగస్టు 28 నాటికి సమ గ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభు త్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. రాజస్థాన్‌కు చెందిన దంపతులు చేసిన ఫిర్యాదుతో సృష్టి ఆసుపత్రి వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం రూ.40 లక్షలు చెల్లించినప్పటికీ, డీఎన్‌ఏ పరీక్షల్లో తమకు సంబంధం లేని బిడ్డను అప్పగించినట్టు తేలడంతో ఈ అక్రమ దందా బట్టబ యలైంది.
నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో గోపాలపురం పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత్రి డాక్టర్ అట్లూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత (64)ను ప్రధాన నిందితురాలిగా గుర్తించి, ఆమెతో సహా మొత్తం పది మంది ని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో డాక్టర్ నమ్రత 2021 నుంచి అనుమతులు లేకుండానే ఈ ఫెర్టిలిటీ సెంటర్లను నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది.
సరోగసి, ఐవీఎఫ్ పేరుతో ఆమె 1998 నుంచే అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తిం చారు. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి వారిని సరోగసికి ఒప్పించి, ఆ పిల్లలను సం తానం లేని దంపతులకు రూ.20 లక్షల నుం చి రూ.40 లక్షల వరకు అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలింది. క్లినిక్ నుంచి సుమారు 200 ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమదందా రాష్ట్రంలోనే కాకుండా ఏపీ, ఒడిశా, కోల్‌కతాలలోనూ విస్తరించిందని ప్రాథమిక దర్యాప్తు లో తేలింది.
సృష్టి వ్యవహారం బయటికి రా వడంతో, ఈ ఆసుపత్రి ద్వారా పిల్లల్ని పొం దిన పలువురు దంపతులు తమ ఫోన్లను స్విచ్‌ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆమెపై అనేక కేసు లు నమోదు కావడం, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆమె వైద్య డిగ్రీని సస్పెండ్ చేయాలని నిర్ణయించడం గమనార్హం.
ఇంత పెద్ద ఎత్తున అక్రమ దందా జరుగుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారనుంది. అక్రమ సరోగసి రాకెట్ వెనుక ఉన్న పూర్తిస్థాయి నెట్‌వర్క్, ఇతర అక్రమ క్లినిక్‌ల పాత్రపై దర్యాప్తు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉంది.