24 August, 2026 | 11:31 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

అందుబాటులో ఉండి సేవలందించాలి

18-06-2025 12:00 AM

 జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల అర్బన్, జూన్ 17 (విజయక్రాంతి): ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మల్లాపూర్, రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం తగదని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలన్నారు.

బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు,అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎస్పి వెంట ఎస్‌ఐలు రాజు, సుదీర్ రావు సిబ్బందిఉన్నారు.