calender_icon.png 20 June, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ డాక్టర్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం

18-06-2025 12:00:00 AM

నాగార్జునసాగర్, జూన్17: నాగార్జునసాగర్ కు చెందిన డాక్టర్ గారపాటి కిషోర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సర్జన్ గా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హిల్ కాలనీలో జన్మించిన కిషోర్ పాఠశాల విద్యను స్థానిక ప్రభుత్వ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పూర్తి చేసి కళాశాల విద్యను స్థానికంగానే ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పూర్తిచేసి మెడిసన్ లోమంచి ర్యాంకుతో డాక్టర్ విద్యను పూర్తి చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అతని తండ్రి జోజి స్థానికంగా ఒక సాధారణ టైలర్ గా జీవితాన్ని కొనసాగిస్తూ తమ పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో తను చేసిన కృషి అంతా ఇంతా కాదు. గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవ లతో పాటు కార్పొరేట్ స్థాయి శస్త్ర చికిత్సలను చేరువ చేసిన డాక్టర్ గారపాటి కిషోర్ కుమార్ కు ఈ అరుదై న పురస్కారం దక్కింది.

లక్షల రూపాయల వ్యయమయ్యే వివిధ రకాల శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందిస్తున్న జనరల్ సర్జన్ కిషోర్ సేవలను గుర్తించి సుమన్ టీవీ హై రాబాద్ వే దికగా నిర్వహించిన వేడుకల్లో డాక్టర్ గారపాటి కిశోర్ అవార్డును అందుకున్నారు డాక్టర్ కిషోర్ కు పురస్కారం దక్కడంతో సహచర వైద్యులు, గ్రామస్థులు ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.