పోలింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండండి
సీపీఐ నాయకులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచన
అశ్వారావుపేట, విజయకాంత్రి (మే12): పోలింగ్ వేళ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన అశ్వారావుపేటలోని సీపీఐ కార్యాలయాన్ని సందర్శించారు. సీపీఐ జిల్లా నాయకులు సయ్యద్ సలీమ్, మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, సీపీఎం నాయకులు కే పుల్లయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. మండలంలో పోలింగ్ ఇతర ఏర్పాట్లపై చర్చించారు. అందరూ కలసి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజార్టీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు మంత్రి పొంగులేటిని, ఎమ్మెల్యే జారే ఆదినారాయణను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు జూపల్లి రమేశ్, సుంకవల్లి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.




