13 April, 2026 | 9:11 PM

ఓటు వజ్రాయుధం

13-05-2024 12:25 AM

ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ 

సిద్దిపేట/ హుస్నాబాద్, మే 12 (విజయక్రాంతి): ఓటు వజ్రాయుధమని, ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అని తెలిపారు.