calender_icon.png 10 November, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

10-11-2025 05:55:32 PM

ఇల్లందు డిఎస్పి చంద్రభాను

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు "చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం" కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బోడ్ రోడ్డు సెంటర్ వరకు డ్రగ్స్ పై పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ముందుగా మండలంలోని 9వ మైల్ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇల్లందు డిఎస్పి చంద్రభాను మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎంస్ పిన్ నెంబర్లు, ఓటిపి వివరాలు చెప్పవద్దన్నారు. బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు 1930కు కాల్ చేయాలని సూచించారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు.

బ్యాంకు తరపున మాట్లాడుతున్నాం మీకు బ్యాంకు లోన్ ఇస్తామని నమ్మించడానికి చూసి మన దగ్గర అమౌంట్ లాక్కుంటారని, కాబట్టి అటువంటి వాటిని ఎవరు నమ్మొద్దు అని తెలిపారు. ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తో లింకు ఉండడంతో మన సెల్ ఫోన్ నంబర్ కూడా మన బ్యాంకు ఎకౌంటు పాన్ కార్డు ఆధార్ కార్డు పెన్షన్ పౌరసరఫరాల వినియోగదానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని దాని ఆసరాగా చేసుకోని సైబర్ నెరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గంజాయి మాదకద్రవ్యాలపై టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. గంజాయి మాదక ద్రవ్యాల నిర్ణయించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు పాల్పడిన రవాణా చేసిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్ని రద్దు అవుతుందని, మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనం అవుతుందని మాదకద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని  తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.