10-11-2025 05:52:59 PM
నిర్మల్ రూరల్ (విజయకాంతి): సోన్ మండలంలోని కడ్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో సుమారు వందమంది భక్తులు అయ్యప్ప మాలధారణ వేశారు. వీరు గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఈ మాలధారణ స్వీకరించారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగుతుందన్నారు. దీక్షలో భాగంగా కటిక నేలమీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం వంటి కఠిన నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జి గురుస్వామి తదితర భక్తులు పాల్గొన్నారు.