calender_icon.png 10 November, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జుట్టు గజేందర్

10-11-2025 06:02:18 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిర్మల్ కు చెందిన జుట్టు గజేందర్ ఎన్నికయ్యారు ఇటీవలే రాష్ట్రోపాధ్యాయ సంఘం(STUTS) సంఘ భవనం కాచిగూడ, హైదరాబాదులో నిర్వహించిన 79 ఆ వార్షిక కౌన్సిల్ సమావేశంలో నిర్మల్ జిల్లాకు చెందిన జుట్టు గజేంద్ర ఎస్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఎస్టియు జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన గజేందర్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గజేంద్రుడు ఎన్నికవ్వడం పట్ల నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్.భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్ సన్మానం చేశారు.

విద్యారంగా అభివృద్ధి పట్ల విశేషమైన అవగాహనతో పాటు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తున్న జుట్టు గజేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వడం ద్వారా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కావడమే కాకుండా సంఘ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాంపల్లి నాగభూషణ్, గోవింద నాయక్, రాష్ట్ర కార్యదర్శులుగా అనుగు బాజారెడ్డి, ఎస్. లక్ష్మీ నరసయ్య, ఆర్థిక కమిటీ సభ్యులుగా ఇర్ఫాన్ షేక్, పల్శీకర్ శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన అందునా వారికి అభినందనలు తెలియజేశారు.