calender_icon.png 17 November, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

16-11-2025 12:00:00 AM

సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ బీ. ఆనంద్

ముషీరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ బి. ఆనంద్ ఉన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడలోని ఏవీ కళాశాల ఆడిటోరియంలో దోమలగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై  ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 

సైబర్ నేరాలపై ప్రజలు, ముఖ్యంగా యువత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉం డాలని ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఏసిపి ఎ.  యాదగిరి,  దోమలగూడ ఇన్స్పెక్టర్ అంజత్ అలీ, అదనపు ఇన్స్పెక్టర్, ఎస్సైలు కే.  శ్రీనివాస్ రెడ్డి, ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ నిరుద్యోగ యువతీ,  యువకులు  తదితరులు పాల్గొన్నారు.