calender_icon.png 17 November, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

16-11-2025 12:00:00 AM

  1. ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మేయర్ కావ్య
  2. మాజీ కార్పొరేటర్లు

జవహర్ నగర్, నవంబర్ 14. (విజయ క్రాంతి) : కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం రోజున జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వీఆర్వో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. మాజీ మంత్రి  ఎమ్మెల్యే  చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను స్వ యంగా అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారం భించిన ఈ పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు ఆశీర్వాదంగా నిలిచాయని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, ఆర్థిక భద్రత, మహిళా సాధికారతకు ఈ పథకాలు ప్రతీకలని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగిస్తుండడం సంతోషకరమని, లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీల అన్నింటిని ప్రభుత్వం నెరవేర్చాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అధ్యక్షు డు కొండల్ ముదిరాజ్, మాజీ మేయర్ మేకల కావ్య. మాజీ కార్పొరేటర్లు, పల్లపు రవి, ఆలూరి సంగీత రాజశేఖర్, జిట్ట శ్రీవాణి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యులు, బండ కింది ప్రసాద్ గౌడ్, పిన్నోజు సుధాకర్ చారి, నర్ర మహేష్, తాటికొండ శ్రీరాములు, సింగన బాలరాజు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.