16-11-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): వీకెండ్ పర్యాటక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన జాతీయ సదస్సు శని వారం గచ్చిబౌలిలోని జాతీయ పర్యాటకఆతిథ్య నిర్వహణ సంస్థ (ఎన్‌ఐటిహెచ్ ఎమ్) లో జరిగింది.
తెలంగాణ వ్యాపార వాణిజ్య సమాఖ్య పర్యాటక కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర పర్యాటకశాఖ, ఎన్‌ఐటిహెచ్‌ఎమ్, అద్భుత భారత్, రామోజీ చిత్రసిటీ, ప్రగతి వనభూమి, సమ్మర్ గ్రీన్ రిసారట్స్ కలిసి ఈ సదస్సును నిర్వహించాయి.
సదస్సులో పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఐఏఎస్, టీజీటిడీసీ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు కాంతి, వ్యాపార వాణిజ్య సమాఖ్య అధ్యక్షుడు ఆర్.రవికుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడు కె.కె.మహేశ్వరి, ఉపాధ్య క్షుడు శ్రీనివాస్ గరిమెళ్ల, డా.జి.బి.కె.రావు, ఏ.వి.రావు, తదితరులు పాల్గొన్నారు.