20-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకొని, సైబర్ నేరాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎ స్పీ డాక్టర్ శబరిష్ ప్రజలను కోరారు. సైబర్ నేరాల నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని పో లీసు శాఖ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాన కల్పించే వివిధ రకాల ఆన్లైన్ మోసాలను సూచించే ప్రచార పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాల ని, డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి పోలీసులం అంటే నమ్మవద్దని, సైబర్ మోసం అని గుర్తిస్తే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలను పాల్పడుతున్నారని, అటువంటి మోసాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండా లన్నారు. నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లను, వ్బుసైట్లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పుతూ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ద్వారా లింకులు పంపి మోసపూరిత వాగ్దానాలతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అనుమానాస్పద కాల్స్ లేదా లిం కులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా www. cybercrime.gov.in వ్బుసైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు..ఈ కార్యక్రమంలో డిఎస్పీలు తిరుపతి రావు, కృష్ణ కిషోర్, గండ్రతి మోహన్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.