20-12-2025 12:00:00 AM
మెదక్, డిసెంబర్ 19(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో రైతులు,డీలర్లు ఫర్టిలైజర్ బుకింగ్ అప్ ద్వారానే యూరియాని కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. శనివారం నుండి యూరియా యాప్ లైవ్ చేయడం జరుగుతుందన్నారు. మొబైల్ వినియోగించి ఇంటినుండే బుకింగ్ చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని రిటైలర్ల వారీగా అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల ప్రస్తుత నిల్వను తనిఖీ చేయవచ్చని తెలిపారు.
యూరియా బుకింగ్ ను పూర్తి చేయడానికి భూ యజమానులు, ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాదారులు, నాన్ పట్టా, ఎ న్డీఎస్ రైతులు, కౌలుదారులు మాత్రమే అర్హులని తెలిపారు. రైతుల భూమిలో నమోదు చేయబడిన సాగు విస్తీరణం ఆధారంగా బుక్ చేసుకోడానికి అందుబాటులో ఉన్న యూరియా బ్యా గుల సంఖ్య స్వయంచాలకంగా నిర్ణయించబడుతుందని ఆయన తెలిపారు.