28 July, 2026 | 12:56 AM

చెరువుల సుందరీకరణ చేపట్టాలి

28-07-2026 12:00 AM
  1. రోడ్డు నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి 
  2. టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ 
  3. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత 
  4. మల్‌రెడ్డి రాంరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సుజాత నాయక్, ప్రకాష్ గౌడ్, లక్ష్మి ప్రసన్న, ఈశ్వరమ్మతో పలు సమస్యలు వివరించి పరిష్కరించాలని వినతి

ఎల్బీనగర్, జూలై 26 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్, బండ్లగూడ చెరువులు, సాహెబ్ నగర్ లోని కాప్రాయి చెరువు ను సుందరీకరణ చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అధికారులను టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కోరారు. ఈ మేరకు సోమవారం జోనల్ కమిషనర్ వికాస్ మహా తో ను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి  రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు  ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి,  రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగోని లక్ష్మీప్రసన్న, సుజాత నాయక్, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ తదితరులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న బోనాల పండుగకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన  ఏర్పాట్లు, అవసరమైన చోట మట్టి పోయాలని సూచించారు. ఎల్బీనగర్ లోని ఎల్పీటీ  మార్కెట్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి రోడ్డు పై నిర్మించిన ఫుట్ పాత్ ను సరిచేయాలని కోరారు. పలు కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని, హయత్ నగర్ పాత విలేజ్ రోడ్డు విస్తరణ  సందర్భంగా ఇళ్లు, ఆస్తులు కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హయత్ నగర్ లో ఇల్లు కూలిపోయే వారికి నష్టపరిహారం అందించే విషయాన్ని చర్చిస్తామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.