వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా
సంస్థాన్ నారాయణపూర్, జూలై 27: మండలంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పూజ ఆధ్వర్యంలో విత్తన మేళను ప్రారంభించారు. ఎల్ నినో ప్రభావంతో తక్కువ నీరుతో పండే పంటలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు వచ్చే కందులు, సజ్జలు, రాగులు, కొర్ర, సామలు,కూరగాయలను సాగు చేసుకోవాలని అన్నారు.
మండలానికి చెందిన కిసాన్ ట్రేడర్స్,రైతు మిత్ర,మన గ్రోమోర్,సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్లు రైతువేదికలో స్టాళ్లు ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న విత్తనాలు,నానో యూరియా, నానో డిఎపి ఉపయోగాలను రైతులకు వివరించారు. మూడు రోజుల పాటు జరిగే విత్తన మేళా ను రైతులు సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలను పొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమoలో మహ్మదాబాద్ సర్పంచ్ ముత్యాల అంజయ్య, గంగముల తండా సర్పంచ్ కరంటోతు లచ్చు నాయక్, నారాయణపురం ఉప సర్పంచ్ పల్లె మల్లా రెడ్డి, వార్డు సభ్యులు మందుగుల బాలకృష్ణ, పందుల యాదగిరి, వ్యవసాయ అధికారులు సైదులు, ఎం. అనురాధ,త్రివేణి, ఎస్. నవ్య , రైతులు పాల్గొన్నారు.






