04-07-2025 12:52:51 AM
శేరిలింగంపల్లి, జూలై 3:చెరువులు ము రుగు నీటితో కలుషితం కాకుండా పరిరక్షిస్తామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నా గేందర్ యాదవ్ అన్నారు. గురువారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరు వు,చాకలి చెరువులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. గోపిచెరువు, చాకలి చెరువులో ప్రత్యేక డైవర్షన్ ఛానళ్లను ఏర్పాటు చేసి మురుగునీరు చేరకుండా చూ స్తామని, సంబంధిత అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
చెరువులను సుందరీకరించి ఆహ్లాదకర వా తావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ నళిని, ఏఈ శశాంక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, రవీందర్ గౌడ్,గోపాల్ యాదవ్,మల్లారెడ్డి, రాజ్ కుమార్, శ్రీకాంత్, గఫర్, వెంకట చారీ, శివయ్య, సత్యనారాయ ణ, నర్సింహా, కృష్ణ, స్థానికులుపాల్గొన్నారు.