calender_icon.png 4 July, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

04-07-2025 12:53:00 AM

- నేడు నిర్వహించే సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి

-రాష్ట్ర టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముందే ఆవేదనను వ్యక్తం చేస్తున్న నాయకులు

- మీడియా సమావేశం తరువాత మాట్లాడదామని నాయకులకు సర్దిబాటు 

- రాష్ట్ర టిపిసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య 

గద్వాల, జులై 03 ( విజయక్రాంతి ) : ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలోకి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర టిపిసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్ల య్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర టి పిసిసి జనరల్ సెక్రటరీ ఫయాజ్, స్థానిక ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.

ఏ ఐ సిసి అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల, గ్రామ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులతో శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడి యంలో సమావేశం ఉంటుందని గద్వాల నుండి మండల, గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పేద ప్రజల పార్టీ అని, ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేస్తున్నామని, ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ప్రజలోకి తీసుకుని వెళ్లి స్థానిక సంస్థ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గడిచిన 10 ఏండ్ల లో పేద ప్రజలకు ఇండ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. 

 గ్రామ, మండల, బ్లాక్ అధ్యక్షులు లేకుండా మీటింగ్ కు ఎలా రావాలి: మాజీ జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మణ్ ... 

గద్వాల జిల్లా లో మండల, గ్రామ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పటి వరకు నియమించలేదని మరి ఎవరు రావాలి ఎట్లా రావాలని మాజీ జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మణ్ రాష్ట్ర నాయకులను ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుందని ఆ ఇండ్లకు సంబందించి ప్రభుత్వం ఇచ్చినట్లు గా లేదని కేవలం ఎమ్మెల్యే ఇచ్చినట్లుగా ఉందని మరి ప్రజలోకి ఎట్లా వెళ్ళుతుందని ఆయన ఆవేదన ను వ్యక్తం చేసారు. 

 ముఖ్య నాయకులు సమావేశంలో తప్ప ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు: సీనియర్ నాయకుడు ఫరీద్ 

జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అర్ధం కావడం లేదని కేవలం ముఖ్య నాయకులు వచ్చినప్పుడు మాత్రమే వారి పక్కన కూర్చుంటారు తప్ప ప్రజలోకి ఎందుకు వెళ్లడం లేదని సీనియర్ నాయకుడు ఫరీద్ ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ అయిన బిఆర్ ఎస్ పార్టీ కి సంబందించిన జిల్లా పార్టీ కార్యాలయం ఉందని కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం జిల్లా పార్టీ కార్యాలయం లేకపోవడం దారుణమన్నారు. 

 మీడియా ముందు వద్దు సమావేశం తరువాత మాట్లాడుదాం ...

నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న తరుణంలో జిల్లా ముఖ్య నాయకులు మాట్లాడుతూ మీడియా సమావేశంలో వద్దు నేడు జరిగే సమావేశం తరువాత మీరు సూచిం చిన అంశాలపై మాట్లాడుదాం అని సర్ది చెప్పారు.