04-07-2025 12:51:27 AM
మణికొండ జూలై 3: గురువారం మణికొండ మున్సిపాలిటీలో భక్తి కుటీర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర మహోత్సవంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన ప్రత్యేక పూజలు నిర్వహించి రథ యా త్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి తేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు కిరణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, సీనియర్ నాయకులు ముత్యాలు, ప్రభావతి, శ్రీనివాస్, శ్రీపతి, భక్తి కుటీర్ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో భక్తులుపాల్గొన్నారు.