24 June, 2026 | 8:25 AM

ఐస్ థెరపీతో అందంగా..

11-06-2024 12:00 AM

ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంచడంలో ఐస్ థెరపీ బాగా పని చేస్తుంది. ముఖ్యంగా ముడతలను మాయం చేస్తుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కళ్ల చుట్టా ఉన్న ఉబ్బిన భాగాన్ని నార్మల్‌గా మారుస్తుంది. అసలు ఐస్ థెరపీ ఎలా చేసుకోవాలి.. దాని లాభాలేంటో తెలుసుకుందాం..

* ఉదయాన్నే చక్కగా ముఖాన్ని ఫేస్‌వాష్ లేదా సబ్బుతో క్లీన్ చేసుకొని చక్కగా ఫ్రీజ్‌లోని ఐస్ క్యూబ్‌లతో థెరఫీ చేసుకోవాలి. ఇది కళ్ల చుట్టు ఉన్న వలయాన్ని, ఉబ్బిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది. 

* ఐస్ క్యూబ్ చేతితో పట్టుకుని ముఖంపై అప్లు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే.. ఐస్‌ని ఒక పల్చటి క్లాత్‌తో చుట్టి ముఖంపై అప్లు చేసుకోవచ్చు. 

* ఈ థెరపీ ముఖంపై రంధ్రాలను దగ్గర చేసి, మృదువుగా మారుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మంట, ఇరిటేషన్‌ల నుంచి కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. 

* అలాగే ముఖమంతా రక్తప్రసరణ జరిగి.. చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యను నివారిస్తుంది. 

* గ్రీన్ టీ, దోసకాయ రసం వంటి వాటిని ఐస్ క్యూబ్‌లకు జోడించి అప్లు చేస్తే చర్మానికి అవసరమయ్యే యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.