24 June, 2026 | 7:08 AM

ఇక్సిగో ఐపీవోకు మంచి స్పందన

11-06-2024 12:39 AM

న్యూఢిల్లీ, జూన్ 10: ట్రావెల్ ప్లాట్‌ఫాం ఇక్సిగోను నిర్వహిస్తున్న లే ట్రావెన్యూస్ టెక్నాలజీస్ సోమవారం జారీ చేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ల(ఐపీవోల)కు తొలిరోజే మంచి స్పందన వచ్చింది. ఇక్సిగో ఐపీవో రేపటితో ముగుస్తుంది. రూ.740 కోట్ల మేర ఐపీవోను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నారు. ఆఫర్ సైజు 4.37 కోట్లు షేర్లు ఉండగా, మదుపర్లు 6.02 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. వారిలో ఎక్కువగా రిటెయిల్ ఇన్వెస్టర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బిడ్డింగ్‌లో పాల్గొని అలాట్ చేసిన కోటాలో 4.78 రెట్లు కొనుగోలు చేశారు. ఇక ఆ తర్వాత నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రిజర్వ్‌డ్ పోర్షన్‌లో 1.71 రెట్లు కొనుగోలు చేశారు. ఇక క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోసం పక్కన ఉంచిన కోటాలో 0.11 రెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. షేర్ ధరను రూ.8893 గా నిర్ధారించారు.