08-12-2025 08:46:46 PM
రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): టీపీటీఎఫ్ సీనియర్ జిల్లా నాయకులు కంకల బీరన్న ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కంకల బీరన్న సంతాప సభ సోమవారం గొర్రెకుంట కిర్తినగర్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఎంప్లాయిస్ పపాయిల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ వీరన్న చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వీరన్న గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉద్యోగ విరమణ పొందారని, సంవత్సరం గడిచినా ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో మనస్థాపం చెంది సరియైన వైద్యం నేర్చుకోలేని పరిస్థితిలో మరణించారని అన్నారు. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు బెనిఫిట్స్ అందగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30 మంది చనిపోయారని, వారి పిల్లల పెళ్లిళ్లు చేయలేక, అప్పులు కట్టలేక అప్పుల వారు వేధిస్తుంటే మానసికంగా ఆవేదన పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యు. అశోక్, రాష్ట్ర నాయకులు కడారి భోగేశ్వర్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు బెల్లంకొండ రమేష్, జిల్లా నాయకులు పి.మనోజ్, వి. సురేష్ బాబు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎండి మహబూబ్అబ్దుల్, గఫార్, గోవర్ధన్, ఇంద్రసేనారెడ్డి, విష్ణువర్ధన్, కుమారస్వామి, టీయూపీఎస్ అధ్యక్షులు ఏ. కుమారస్వామి, తదితరులు సంఘీభావం తెలియజేశారు.