calender_icon.png 8 December, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోరుట్ల విద్యార్థికి కరాటేలో గోల్డ్ మెడల్

08-12-2025 08:49:32 PM

కోరుట్ల (విజయక్రాంతి): జగిత్యాలలో ఆదివారం నిర్వహించిన రెండవ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2025 పోటీలలో స్పారింగ్ విభాగంలో కోరుట్ల పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కి చెందిన 9వ తరగతి విద్యార్థి అబ్దుల్ ముజిల్ రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ ఎం.ఏ. బారీ, ప్రిన్సిపల్ శ్రీమతి సెలెన్ బారీ విద్యార్థిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ ఎం.ఏ. బారీ  మాట్లాడుతూ కరాటే శిక్షణ అనేది నేటి రోజులలో చదువుకునే బాలబాలికల అందరికీ అవసరం అని ఆత్మరక్షణకే కాకుండా శారీరక శిక్షణకు కూడా కరాటే ఉపయోగపడుతుందని, కరాటే నేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.