12-01-2026 01:11:05 AM
సుల్తానాబాద్, జనవరి 11 (విజయ క్రాంతి): ఆటో ను ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది, సుల్తానాబాద్ ఎస్త్స్ర చంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకపూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళ కూలీలు ఆదివారం మానకొండూరు మండలం ఊటూర్ కు పొలం పనులకు కు వెళ్తున్నారు, సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ శివారులో ఆటోను ట్రాక్టర్ ఢీకొనగా శారద (35) అక్కడికక్కడే మృతి చెందింది, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, శారద మృతి తో బంధువుల రోదనలు మిన్నంటాయి, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర చంద్రకుమార్ తెలిపారు.