29-07-2025 02:24:12 AM
హెపటైటిస్ డే సందర్భంగా కామినేని ఆస్పత్రి వైద్యుల సూచన
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): మన శరీరంలో కీలకమైన అవయవం కాలేయం. దీనిలో వచ్చే వాపునే హెపటైటిస్ అంటారు. అతిగా మద్యపానం, కాలుష్యం కారణంగా వచ్చే వైరస్ వల్ల కాలేయంలో కొవ్వుశాతం పెరగడం వల్ల ఇది రావచ్చు. లక్షణాలు గమనించగానే సరైన సమయానికి పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభించడమే ముఖ్యమని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కామినేని ఆస్పత్రి వైద్యులు సూచించారు.
జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాల జిస్టులు డాక్టర్ వి.ఆర్ సుమంత్ కుమార్, డాక్టర్ తేజస్విని తుమ్మ, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్, డైరెక్టర్ డాక్టర్ ఏవీ కృష్ణచైతన్య సోమవారం మీడియాతో మాట్లాడారు. హెపటైటిస్ పలు రకాలుగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఏ, బీ, సీ, డీ, ఈ అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫెక్ట్ అయిన రక్తం ఎక్కడం, ఒక సూదిని ఇద్దరు ముగ్గురికి వాడడం, పచ్చబొట్టు వేయించుకోవడం, అరక్షిత శృంగారం వల్ల సంక్రమిస్తుంది.
ప్రత్యేక హెపటైటిస్ ప్యాకేజీలు
హెపటైటిస్ ప్యాకేజీని కామినేని ఆస్పత్రి ప్రకటించింది. జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు అందుబాటులో ఉండే ఈ ప్యాకేజీలో హెపటైటిస్ బీ, సీ స్క్రీనింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్టీ), అల్ట్రాసౌండ్ స్కానింగ్, వైద్యుల కన్సల్టేషన్, డైటీషియన్ కన్సల్టేషన్ ఉంటాయి. సాధారణంగా రూ.4,400 అయ్యే ఈ పరీక్షలను కేవలం రూ. 1,499కే చేస్తున్నారు. అలాగే అపాయింట్మెంట్ ఆధారంగా ఉచిత ఫైబ్రోస్కాన్ కూడా చేస్తారు. వైద్యులు సూచిస్తే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల మీద 20శాతం రాయితీ ఉంటుంది. అపాయింట్మెంట్ కోసం 7036270362 నంబరులో సంప్రదించవచ్చు.