29-07-2025 02:25:50 AM
అల్వాల్, జూలై 28: అల్వాల్ అంజయ్యనగర్ కాలనీలోని శ్రీధర్షన్ స్కూల్ లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనిఫాం వేసుకోకుం డా పాఠశాలకు వచ్చిన చిన్నారిపై ప్రిన్సిపాల్ దౌర్జన్యంగా ప్రవర్తించడం తీవ్ర నిరసనలకు దారితీసింది. మొదటి తరగతి చదువుతున్న చిన్నారి కృత్వి క్ పాఠశాలకు సాధారణ దుస్తుల్లో హాజరయ్యాడు. యూనిఫాం వేసుకోలేదన్న కారణంతో ప్రిన్సిపాల్ అతడిపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించారు.
మొదట బాలుడిని పాఠశాల బయట గంటపాటు నిలబెట్టిన ప్రిన్సిపాల్, అనంతరం అతడిపై చేయి చేసుకున్నాడు. చిన్నారి కాళ్లకు గాయా లు, వాపులు రావడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన కృత్విక్ తల్లిదండ్రులు, బాబును ఎందుకు బయట నిలబెట్టారని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా.. వారిపై కూడా స్కూల్ సిబ్బంది దాడికి దిగారు. దీంతో స్థానికులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
విద్యార్థులపై శారీరక హింసకు పాల్పడే ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాం డ్ చేశారు. కాగా చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. పాఠశాల ప్రిన్సిపాల్‌పై తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది.