calender_icon.png 16 August, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి రహదారులు జలమయం.. మరోసారి రాంనగర్ బ్రిడ్జికి వరద ముంపు

16-08-2025 11:45:21 AM

  1. నిలిచిపోయిన రాకపోకలు
  2. ఇళ్లకే పరిమితమైన ప్రజలు 
  3. భారీ వర్షానికి అతలాకుతలం 

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కురుస్తున్న భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఎడతెరపిలేని భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన  రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద నీరు రహదారులలో పరుగులు పెడుతుంది. పాత జిఎం క్రాస్ రోడ్ నుంచి  వర్క్ షాప్ వరకు ప్రధాన రహదారిలోవరద నీరు చేరింది. మరోసారి రాంనగర్ బ్రిడ్జి ఉప్పొంగుతుంది. అశోక్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వరద నీటితో నిండిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోనీ ప్రజలు భారీ వర్షానికి ఇబ్బంది పడుతున్నారు. వరద నీరు నివాసాల్లోకి చేరి ఇక్కట్లు పడుతున్నారు. మున్సిపాలిటీలోని ప్రధాన మురుగు కాలువల సమీపంలో ఉన్న నివాస ప్రాంతాలు వరద తాకిడికి గురయ్యాయి. భారీ వర్షానికి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.