16-08-2025 12:22:08 PM
నిర్మల్, మంచిర్యాల రాకపోకులకు అంతరాయం
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో(Khanapur Constituency) శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అడవిలోని భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం నిర్మల్ ,మంచిర్యాల రహదారిపై కడం వద్ద భారీ వృక్షం రోడ్డు పై అడ్డంగా పడిపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కడం తాసిల్దార్ ప్రభాకర్ హుటాహుటిన తన సిబ్బందితో చెట్టు కూలిన ప్రదేశానికి చేరుకుని రంపాలు, ప్రోకలైన్లతో చెట్టును తొలగించి, రహదారి రాకపోకలను పు నరుద్ధరించారు. కాగా రహదారిపై ప్రయాణం చేస్తున్నవారు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.