16-08-2025 12:39:25 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డాక్టర్ నమ్రత(Doctor Namrata) నేరాంగికారపత్రంలో కీలక అంశాలను పోలీసులు నమోదు చేశారు. డాక్టర్ నమ్రత నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నమ్రత విజయవాడ, సికింద్రాబాద్, విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతున్నారు. సరోగసి పేరుతో నమ్రత రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వసూలు చేసింది. ఏజెంట్లను నియమించుకుని పిల్లలను కొనుగోలు చేసింది. ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు డబ్బు ఆశ చూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకుని, ప్రసవం తర్వాత బాలింతల నుంచి డాక్టర్ నమ్రత పిల్లల్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన పిల్లలను సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా నమ్మించింది. పలు పోలీస్ స్టేషన్ లలో తనపై కేసులు నమోదైనట్లు నమ్రత ఒప్పుకున్నారు.