calender_icon.png 16 August, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్క అడ్డు వచ్చి కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు

16-08-2025 11:59:31 AM

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు 

కామారెడ్డి, (విజయక్రాంతి): కుక్క అడ్డు రావడంతో కారు బోల్తా పడి ఐదుగురికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కుమ్మరపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మండలం  పిప్రి గ్రామానికి చెందిన బొమ్మెన సాయి కుమార్ లు ఖతార్ గల్ఫ్ నుంచి వస్తుండగా వారిని బంధువులు, కుటుంబ సభ్యులు కారులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి వారిని కారులో తీసుకొని వస్తుండగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కారుకు అడ్డంగా కుక్క రావడంతో దానిని తప్పించబోయి కారు బోల్తా పడింది.

కారులో ప్రయాణం చేస్తున్న నిజాంబాద్ జిల్లా  బడా భీంగల్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ ఓరగంటి మైపాల్, గల్ఫ్ నుంచి వస్తున్న జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామానికి చెందిన రాజశేఖర్, నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన బొమ్మెన సాయికుమార్ లను గల్ఫ్ నుంచి వస్తుండగా వారిని కారులో ఎయిర్పోర్టు నుంచి తీసుకువస్తుండగా నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన  లక్ష్మీ, ఆర్మూర్ కు చెందిన మాసం సాయికుమార్, రాజశేఖర్, బొమ్మెన సాయికుమార్, కారు డ్రైవర్ మైపాల్ లు గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.