16-08-2025 11:47:51 AM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఉమ్మడి నిజాంబాద్ జిల్లా లోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో(Yella Reddy Constituency) ఉన్న పోచారం ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీ వరద రావడంతో పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని జలకళను సంతరించుకుంది. శనివారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి 21 అడుగులకు నీటిమట్టం చేరుకుని అలుగు దూకుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 3వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అలుగు పొర్లుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అధికంగా పంటలు బాగా పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున ప్రాజెక్టు, వాగుల వైపు ఎవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రధాన కాలువ ద్వారా 120 క్యూసెక్కుల నీటిని పంటల సంరక్షణకు వదిలినట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని
మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు కూడా ఎగువన ఉన్న ఉన్న మంజీరా నది, గుండా సింగూరు డ్యామ్, నుండి సుమారు 40000 క్యూసెక్కుల భారీ వరద నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తుందని పరిసర ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు సాగు నీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. బాన్సువాడ బోధన్ నియోజకవర్గాల్లోని రైతులు ప్రాజెక్ట్ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నుంచి జులై 15 నుండి నీటిని అధికారులు విడుదలను ప్రారంభించారు. త్వరలోనే నిజం సాగర్ ప్రాజెక్టు నిందనున్నట్లు ఆయన పేరుకున్నారు.