16-08-2025 12:06:50 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న విడతలపై లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులలోకి వరద నీరు భారీగా చేరడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కుమ్రం భీం ప్రాజెక్టు( Kumuram Bheem Project) మూడు గేట్లు ఎత్తగా పొట్టి బాబు ప్రాజెక్ట్ రెండు గేట్లను అధికారులు ఎత్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఎడతెరిపిలేని వర్షాలతో కాలనీలు, గ్రామాలలోని రోడ్లపై వరద నీరు పారుతుంది.లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పల్లెలు జలమయం అయ్యాయి.పంట పొలాలలో వర్షపు నీరు నిలవడంతో రైతులు పంట ఎదుగుదలపై ఆందోళన చెందుతున్నారు.