16-08-2025 11:37:04 AM
ఉదృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు..
నిజాంసాగర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది జలకలను సంతరించుకుంటుంది, నల్లవాగు ద్వారా భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడం, కళ్యాణి ప్రాజెక్టు ద్వారా వరద నీటిని విడుదల చేయడంతో నిజాంసాగర్ మండలంలోని(Nizamsagar Mandal) మంజీరా నది జలకలను సంతరించుకుంటుంది. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో మంజీరా లో చుక్కనీరు లేకుండా బోసిపోయి కనిపించింది. మంజీరా జలకలను సంతరించుకోవడంతో మంజీరా పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.