16-08-2025 12:02:29 PM
లక్షేట్టిపేట,విజయక్రాంతి: లక్షేట్టిపేట మున్సిపాలిటీ లోని బీట్ బజార్ అంకతివాడ, ఉత్కూర్ లోని 9వ వార్డ్, ఎన్ హెచ్ 163 జాతీయ రహదారి తో పాటు పలు కాలనీలు గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల(heavy rain) కారణంగా నీట మునిగాయి. కాలనీ వరద నీరు అంత ఇండ్లలో చేరడంతో ప్రజలు ఇంట్లో ఉండలేని, బయటకు వెళ్ళలేని దుస్థితి నెలకొంది. వర్షం నీరు వెళ్లేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్, సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.