calender_icon.png 1 May, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భృంగి కళాశాలలో ఉత్తమ ఫలితాలు

29-04-2025 12:00:00 AM

వికారాబాద్ ఏప్రిల్, 28: ఏసిఆర్ భృంగి  కళాశాల విద్యార్థులు  ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం ఎంతో అభినందనీయమని భృంగి విద్యాసంస్థల చైర్మన్ మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కళాశాలలో ఇంటర్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని భృంగి కళాశాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని, విద్యార్థులు,  అధ్యాపకుల శ్రమ వల్ల మంచి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్ లో దీపిక   470 మార్కులకు గాను 468 మార్కులు సాధించడం గర్వకారణం అన్నారు. బైపీసీ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు గాను  సాదియా 425, సుమాయ జహన్ 424, ఎండి ఇలియాస్ 424 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శివప్రసాద్, కుమారస్వామి, రమాదేవి తదితరులు సన్మానించారు.