రాష్ట్ర నూతన డీజీపీ ఆనంద్‌కు శుభాకాంక్షలు
08-05-2026 12:00 AM
ఘట్ కేసర్, మే 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా బాధ్యతలు చేపట్టిన సీ.వి. ఆనంద్ ని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీని కలిసిన వారిలో లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగ్ రావు, రాష్ట్ర సెక్రెటరీ మోహన్ రావు, రాష్ట్ర నాయకులు రాములు ఉన్నారు.






