2 May, 2026 | 3:47 AM

తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన వి. హనుమంతురావుకు శుభాకాంక్షలు

02-05-2026 02:23 AM

ఘట్ కేసర్, మే 1 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ, అనుభవం ఎస్సీ, ఎస్టీ కులాల, హక్కుల కొరకు పోరాటం చేసిన నాయకుడు వి. హనుమంత రావుని తెలంగాణ ప్రభుత్య సలహాదారునిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి వర్గానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ కృతజ్ఞతలు తెల్పుతూ శుక్రవారం గాంధీభవన్ లో  హనుమంత్ రావుని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి తన హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టి సెల్  అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్, యువ నాయకులు వేముల మణిశరన్ గౌడ్, వేముల వంశీగౌడ్, దొంకెన శివగౌడ్, గోడల ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.